హరిహర వీరమల్లు రిలీజ్ తర్వాత చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో పవన్ మాట్లాడుతూ.. మీరు బాయ్ కాట్ అని బెదిరిస్తే బెదిరిపోను. నెల్లూరు వీధుల్లో మొదలైన నా ప్రయాణం ఇప్పుడు డిప్యూటీ సీఎం వరకు చేరుకుంది. మీరు బెదిరిస్తే బెదిరిపోతానా.. బాయ్ కాట్ చేస్తే చేసుకోండి.. దెబ్బలు తినే ఈ స్థాయికి వచ్చాను. మీరు బాయ్ కాట్ చేసినంత మాత్రాన ఏం తేడా ఉండదు అని పవన్ తెలిపారు. అభిమానులే నా బలం. మనం బలంగా ఉన్నాం కాబట్టే మనకి వ్యతిరేకంగా నెగిటివిటీ ఉంది. ఒక సినిమాని చూసి ఇంతలా భయపడి పోతున్నారంటే మన స్థాయి ఏంటో అర్థం అవుతోంది అని పవన్ అన్నారు.