అవసరమైతే జంతర్ మంతర్ లో ధర్నా చేస్తాం
NEWS Jul 24,2025 09:15 pm
తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్లమెంట్ లో ప్రస్తావించాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అవసరమైతే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామన్నారు. కుల గణనకు సంబంధించి తెలంగాణ మోడల్ అనడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే..ఈ సర్వే కు రేర్ మోడల్ గా పేరు పెట్టాలని కోరారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కీలక వ్యాఖ్యలు చేశారు. మేడం సోనియా గాంధీ రాసిన లేఖ నాకు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు లాంటిదన్నారు సీఎం.