ప్రజా ఆరోగ్య బాధ్యత మన అందరిదీ
NEWS Jul 27,2025 09:26 pm
ఆరోగ్య పరిరక్షణ బాధ్యత ప్రజలపై కూడా ఉందని డాక్టర్ తేజస్విని పేర్కొన్నారు. పట్టణంలోని ఆదర్శనగర్ లో అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. వర్షాకాలం దృష్ట్యా వ్యక్తిగత పరిసరాల శుభ్రత బాధ్యత మనందరిపై ఉందన్నారు. మలేరియా డెంగ్యూ, డయేరియా వంటి ప్రమాదకర వ్యాధులు ప్రభలే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.