జర్నలిస్టులకు సంబంధించి 3 ప్రధాన సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే జర్నలిస్ట్‌లకు కొత్త అక్రిడిటేషన్లు ఇస్తామ,ఆ వెంటనే హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉండటంతో న్యాయ నిపుణులతో చర్చించి ఆటంకం కలగకుండా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో TUWJ (IJU) జిల్లా మహాసభలో మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.