బాబూ..లక్ష కోట్ల లిక్కర్ స్కాం కథేంటి...?
NEWS Jul 24,2025 05:17 pm
ఏపీపీసీసీ చీఫ్ షర్మిల ఏపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. లక్ష కోట్ల లిక్కర్ స్కాం వెనుక ఉన్న నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు లిక్కర్ స్కాం మీద శ్వేతపత్రం ఇచ్చారని, లక్ష కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే డిజిటల్ పేమెంట్స్ కేవలం 600 కోట్లు వచ్చాయని చెప్పారని, మరి మిగతా రూ. 99 వేల కోట్లు ఎక్కడికి, వవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలన్నారు. సీఎం చేసిన ఆరోపణలపై విచారణ జరపాలన్నారు.