TDF పాతికేళ్ల వేడుకలకు రండి
- డిఫ్యూటీ సీఎంకి TDF ఆహ్వానం
NEWS Jul 24,2025 04:07 pm
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆగస్టు 8, 9, 10 తేదీల్లో జరగనున్న తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF-USA) సిల్వర్ జూబ్లీ వేడుకలకు డిఫ్యూటీ సీఎం బట్టి విక్రమార్కను TDF ప్రతినిధులు ఆహ్వానించారు. TDF ఇండియా అధ్యక్షుడు మట్ట రాజేశ్వర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ వినీల్‌తో కూడిన ప్రతినిధి బృందం డిఫ్యూటీ సీఎంని కలిసి ఆహ్వానించారు. పాతికేళ్ల TDF ఉద్యమాలను, అభివృద్ధి సేవలను డిఫ్యూటీ సీఎం ఈ సందర్భంగా కొనియాడారు.