చామకూర మల్లారెడ్డి ఇంటిపై ఐటీ సోదాలు
NEWS Jul 24,2025 03:41 pm
మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఇంటిపై ఐటీ సోదాలు చేపట్టింది. ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల విషయంలో విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టింది. వచ్చిన డబ్బుల విషయంలో ఆదాయ పన్నులో హెచ్చు తగ్గులను గుర్తించారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ప్రీతి రెడ్డి, భద్ర రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.