సార్లూ.. రోడ్డు మరమ్మతులు చేయరూ..
NEWS Jul 24,2025 03:40 pm
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి కండ్లపెళ్లి, కిష్టంపేట్, రాయికల్‌కు వెళ్లే రహదారిల గుంతలుగా మారింది. దీంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు కండ్లపెళ్లి శివారులో TG మోడల్ స్కూల్ ఉండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సైతం తిప్పలు పడుతున్నారు. రోడ్డుకు మరమ్మతులు చేయించాలని అధికారులను కోరుతున్నారు. వర్షాకాలం కావడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాపోతున్నారు.