శ్రవణ్ రావుకు ఏపీ సిట్ నోటీసులు
NEWS Jul 24,2025 11:18 am
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన శ్రవణ్ రావుకు ఏపీ సిట్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నారు శ్రవణ్‌రావు. దుబాయ్‌లోని శ్రవణ్‌రావు ఫ్లాట్‌లో ఏపీ లిక్కర్ కేసు నిందితులకు ఆశ్రయం ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు పోలీసులు.