శ్రీశైలం రేడియం క్రెస్టు గేట్లు ఎత్తివేత
NEWS Jul 24,2025 10:53 am
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు కొనసాగుతోంది. ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి వర్షాలు. దీంతో రెండు రేడియల్ క్రెస్టు గేట్ పది అడుగుల మేర ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 75,383 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 1,21,482 క్యూసెక్కులు ఉండగా పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.50 అడుగులు మేర ఉంది. పూర్తి స్దాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 207.4103 టీఎంసీలుగా ఉంది. నీరు సమృద్దిగా ఉండడంతో కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.