మాజీ మంత్రి అనిల్ కు నోటీసులు
NEWS Jul 24,2025 09:37 am
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని దూషించిన కేసులో ఈనెల 26న ఉదయం 10 గంటలకు విచారణ రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఆయన ఇంట్లో లేక పోవడంతో నివాసానికి కోవూరు ఎస్ఐ రంగనాథ గౌడ్ నోటీసులు అంటించారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి సైతం నోటీసులు ఇచ్చారు.