నాగార్జునసాగర్ కు వరద ఉధృతి
NEWS Jul 24,2025 09:26 am
ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 1,21,711 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 5,685 క్యూసెక్కులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 574.70 అడుగుల వద్ద ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీ లు కాగా ప్రస్తుత సామర్థ్యం 268.3667 టీఎంసీలకు చేరుకుంది. నీళ్లు సమృద్దిగా ఉండడంతో జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.