భక్తులు కిటకిట కాసులు గలగల
NEWS Jul 24,2025 09:22 am
తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 80 వేల 130 మంది భక్తులు దర్శించుకున్నారు. 26 వేల 786 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.55 కోట్లు వచ్చినట్లు ఈవో జె. శ్యామల రావు తెలిపారు. ప్రస్తుతం స్వామి వారి దర్శనం కోసం 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని వారికి కనీసం 12 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.