సనాతన ధర్మం ఏ మతానికి వ్యతిరేకం కాదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ధర్మం దారి తప్పిన ప్రతిసారి దాన్ని పరిరక్షించడానికి ఒక శక్తి పుడుతుందన్నారు. జీవించాలి అంటే జిజియా పన్ను కట్టాలనే కంటక పాలకుడి నుంచి అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని సాధించడానికి పోరాడే యోధుడి కథగా హరిహర వీరమల్లు చిత్రం నిలిచి పోతుందన్నారు. చరిత్రలో కీలకమైన విషయాలు భవిష్యత్తు తరాలకు బలంగా చెప్పాలని భావించి దీనిని తీశామన్నారు. సినిమాను ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పారు.