కనిగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద గురువారం తెల్లవారుజాము నుంచి పారిశుద్ధ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బదిలీ కార్మికులను పనిలోకి తీసుకోకుండా వ్యవహరించిన మున్సిపల్ అధికారుల తీరును వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికుల పేరుతో కనిగిరి మున్సిపాలిటీలో అవినీతి చోటు చేసుకుంటుందని విచారణ చేపట్టాలని సిఐటియు జిల్లా నాయకులు పిసికేశవరావు డిమాండ్ చేశారు.