పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
NEWS Jul 23,2025 10:28 pm
స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న వివిధ విభాగాలకు సంబంధించిన భవనాలను టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు పరిశీలించారు. కార్డియాక్ న్యూరో సైన్సెస్, స్విమ్స్ పాత భవనం, స్టాఫ్ క్వార్ట్స్ లను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న పనులు మరింత నాణ్యంగా చేప్టటాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న పనులు, డిజైన్లు , వైద్య పరికరాలు, సిబ్బంది తదితర అంశాలను నిర్ణీత సమయానికి పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.