శ్రీవారిని దర్శించుకున్న ఏపీ స్పీకర్
NEWS Jul 23,2025 10:03 pm
తిరుమల శ్రీవారిని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీటీడీ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పూజారులు వేదాశ్వీరచనం చేశారు. స్పీకర్ కు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటాన్ని అందజేశారు. స్వామి వారిని దర్శించు కోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం కూటమి సర్కార్ సంక్షేమంపై ఫోకస్ పెట్టిందన్నారు.