అవును ఫోన్ ట్యాప్ చేయిస్తున్నాం
NEWS Jul 23,2025 09:58 pm
సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన చిట్ చాట్ సందర్బంగా తమ సర్కార్ ప్రజా ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నట్లు చెప్పారు. ఇది అన్ని ప్రభుత్వాలు చేసేవేనని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చట్ట వ్యతిరేకం కానే కాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చట్ట విరుద్దం కాదు కానీ దానికంటూ ఒక పద్ధతి ఉంటుందని స్పష్టం చేశారు.