హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. భూముల పర్యావరణ పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసింది. ఈ నేపథ్యంలో విచారణకు సమయం కోసం అమికస్ క్యూరీ సుప్రీంను కోరింది. దీంతో తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది. కాగా పర్యావరణ పునరుద్ధరణ జరపకపోతే అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు.