CM చంద్రబాబును కలిసిన కనిగిరి ఎమ్మెల్యే
NEWS Jul 23,2025 11:02 pm
సీఎం చంద్రబాబును ఆయన క్యాంపు కార్యాలయంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి కలిశారు. సీసీ రోడ్లు, తాగునీరు, ఆర్ అండ్ బి రోడ్లు, డ్రైన్లు తదితర అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరగా సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు. కనిగిరి అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయింపుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు.