సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
NEWS Jul 23,2025 09:21 pm
కనిగిరి పట్టణంలోని గార్లపేట రోడ్డులో గల మాంటిసోరి పబ్లిక్ స్కూల్ మరియు కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని కనిగిరి ఎస్సై టి శ్రీరామ్ బుధవారం నిర్వహించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.