నారా లోకేశ్ చొరవతో... విశాఖకు పెట్టుబడుల వెల్లువ
NEWS Jul 23,2025 01:14 pm
ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ చొరవతో రాష్ట్రానికి పేరుమోసిన కంపెనీలు వస్తున్నాయి. తద్వారా విశాఖ మహానగర రూపురేఖలు మారబోతున్నాయి. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన 9వ ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో ఐటీ రంగంలో రూ.20,216 కోట్ల పెట్టుబడులు... 50,600 ఉద్యోగాలు కల్పించే నాలుగు భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు.