భారత్-పాక్ మ్యాచ్ రద్దు కావడంపై స్పందించిన మహ్మద్ సిరాజ్
NEWS Jul 23,2025 05:37 pm
భారత్ - పాక్ మ్యాచ్ రద్దుపై స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ స్పందించాడు. ఈ విషయంపై తాను ఎలా స్పందించాలో తనకు తెలియడం లేదని వ్యాఖ్యానించాడు. అసలు అక్కడ ఏం జరిగిందో తనకు అవగాహన లేదని, ఏమి మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని అన్నాడు. తన దృష్టి ప్రస్తుతం సిరీస్‌పైనే ఉందని స్పష్టం చేశాడు.