లోతట్టు ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
NEWS Jul 23,2025 11:03 pm
మంగళవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. గోవిందరావుపేట మండలం పస్రా గుండ్లవాగు, తాడ్వాయి మండలం జలగలంచ వాగు ఉద్ధృతిని సీతక్క పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. తక్షణ సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 18004257109 సైతం ఏర్పాటు చేసినట్లు సీతక్క తెలిపారు.