తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు.. ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
NEWS Jul 23,2025 01:47 pm
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది.