ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం: డిసిఎంఎస్ చైర్మన్
NEWS Jul 24,2025 10:20 am
వెలిగండ్ల మండలంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి సహకారంతో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని డిసిఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి పేర్కొన్నారు. వెలిగండ్ల మండలలోని గోకులం, మల్లంరాజుపల్లి గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సమ స్యలు అడిగి తెలుసుకున్నారు. మండల అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, నియోజవర్గ రైతు అధ్యక్షులు కేల ఇంద్ర భూపాల్ రెడ్డి, మస్తాన్ రెడ్డి, బాల కేశవులు, శ్రీను, మాధవ రెడ్డి, మల్లికార్జున, కార్యకర్తలు పాల్గొన్నారు.