ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు
NEWS Jul 23,2025 10:14 am
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో లో లెవల్ బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తోంది మున్నేరు వాగు. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మద్దివంచ, రాంపురం, పులిగుట్ట తండా, కొత్త తండా, రాము తండా, హోల్య తండాతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.