నిండు కుండగా నాగార్జున సాగర్
NEWS Jul 23,2025 09:58 am
నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుతం 572.20 అడుగులకు చేరుకుంది. డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 262.0922 టీఎంసీల వద్ద కొనసాగుతోంది.శ్రీశైలం నుంచి వస్తున్న ఇన్ ఫ్లో 94,709 క్యూసెక్కులకు చేరుకోగా ఔట్ ఫ్లో 4,835 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ ఎడమ కాలువకు 3,035 క్యూసెక్కులు, హైదరాబాద్ కు 1800 క్యూసెక్కుల నీటిని వదిలారు.