పోటెత్తిన వరద జూరాల కళకళ
NEWS Jul 23,2025 09:25 am
ఎగువన కురుస్తున్న వర్షాలకు జలకళను సంతరించుకుంది జూరాల ప్రాజెక్టు. వరద ఉధృతి కొనసాగుతుండడంతో 12 గగేట్లను ఎత్తి వేశారు. ఇన్ ఫ్లో 92000 వేల క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 1లక్ష 7 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516. మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 318.090 మీటర్లు వద్ద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 8.790 టీఎంసీలుగా ఉంది. నీరు సమృద్దిగా ఉండడంతో జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాలలో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.