సుంకేసుల ప్రాజెక్టుకు వరద ప్రవాహం
NEWS Jul 23,2025 09:16 am
వరద ఉధృతి కొనసాగుతోంది సుంకేసుల ప్రాజెక్టుకు. భారీగా నీరు చేరడంతో 9 గేట్లు ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 43,000 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 36,975 క్యూసెక్కులుగా ఉంది. ఇదిలా ఉండగా కెసి కెనాల్ కు 1,540 క్యూసెక్కులు విడుదల చేశారు. జలాశయం పూర్తి సామర్థ్యం 1.2 టిఎంసిలు ఉండగా ప్రస్తుత సామర్థ్యం 1.068గా ఉంది.