శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
NEWS Jul 23,2025 09:11 am
శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. ఒక రేడియల్ క్రెస్టు గేట్ పది అడుగుల మేర ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 1,43,108 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 94,709 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 883.80 అడుగులు ఉంది. పూర్తి స్దాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 208.7210 టీఎంసీలుగా ఉందని అధికారులు తెలిపారు. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందన్నారు.