నేటి నుంచి ఇంగ్లండ్ తో టీమిండియా నాలుగో టెస్టు ఆడనుంది. 5 టెస్టుల సిరీస్ లో 2-1 తేడాతో ముందంజలో కొనసాగుతోంది స్టోక్స్ సేన. ఈ మ్యాచ్ గెలిస్తేనే భారత్ కు సిరీస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇంగ్లండ్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్ జట్టులో కీలక మార్పులు చేస్తామని ప్రకటించారు కోచ్ గంభీర్. ఇండియా జట్టు అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో బలంగానే ఉన్నా ఇంగ్లండ్ ముందు చేతులెత్తేయడం విస్తు పోయేలా చేస్తోంది.