ములుగు జిల్లాను ముంచెత్తిన వర్షం
NEWS Jul 23,2025 08:02 am
ములుగు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వెంకటాపురంలో అత్యధికంగా 227 మి.మీ వర్షపాతం నమోదైంది. మంగపేట, వాజేడు వెంకటాపురం మండలాల్లో వానలు దంచి కొట్టాయి. దీంతో రహదారులు జలమయం అయ్యాయి. వాహనాల రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టరేట్ లో 18004257109 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామన్నారు.