బిజెపిలో కుట్రలు చేస్తూ బీసీలను ఒక్కొక్కరిని సాగనంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేర్చమని చెప్పడం బీసీల విద్రోహ చర్య తప్ప మరోటి కాదన్నారు. బీసీ రిజర్వేషన్లపై రామచంద్రరావు 48 గంటల్లోగా తాను చేసిన కామెంట్స్ ను ఉప సంహరించు కోవాలని డిమాండ్ చేశారు. లేక పోతే బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. బిజెపి బీసీ వ్యతిరేక చర్యలు మానుకోకపోతే తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి రావడం అసంభవం అన్నారు.