నా సినిమాలో ఎలాంటి రాజకీయ అంశాలు లేవు
NEWS Jul 23,2025 06:33 am
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను నటించిన హరి హర వీరమల్లు సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహినూర్ వజ్రం చుట్టూ సినిమా కథ నడుస్తుందన్నారు. ఔరంగజేబు అరాచకాలను ఎదిరించే పాత్రలో తాను నటించానని, ఈ సినిమాను ఆదరించాలని కోరారు. చారిత్రాత్మక నేపథ్యం కాబట్టి కొంత వర్క్ అవుట్ చేశామన్నారు. సినిమాలో ఎలాంటి రాజకీయ అంశాలు లేవని, అయితే ప్రస్తుతం తాను మూవీస్ కంటే పాలిటిక్స్ కే ప్రయారిటీ ఇస్తానని చెప్పారు.