అరుదైన ఘనత సాధించిన హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి
NEWS Jul 22,2025 08:42 pm
హైదరాబాద్‌లోని నిమ్స్ యూరాలజీ విభాగం అరుదైన రికార్డును నెలకొల్పింది. గత ఆరు నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది. 1989లో ప్రారంభమైనప్పటి నుంచి మూత్రపిండ మార్పిడి అవసరమైన వారికి నిమ్స్ ఆశాదీపంలా కనిపిస్తోంది.