రూ. 199 కోట్ల విరాళాలపై పన్ను మినహాయింపు.. కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురు
NEWS Jul 22,2025 08:39 pm
ఆదాయపు పన్ను మినహాయింపు విషయంలో కాంగ్రెస్ పార్టీకి మరోసారి నిరాశ ఎదురైంది. రూ. 199 కోట్ల విరాళాలపై పన్ను మినహాయింపు కోరుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన విజ్ఞప్తిని ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఐటీఏటీ) తిరస్కరించింది. రిటర్నులు ఆలస్యంగా దాఖలు చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని, చట్టం ప్రకారం మొత్తం ఆదాయానికి పన్ను చెల్లించాలని స్పష్టం చేసింది.