నాలుగో టెస్టుకు ముందు భారత జట్టుకు స్టోక్స్ వార్నింగ్!
NEWS Jul 22,2025 06:55 pm
టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు రేపటి (జులై 23) నుంచి జరగనుంది. ఈ నేపథ్యంలో, ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ టీమ్ ఇండియాకు గట్టి హెచ్చరిక జారీ చేశాడు. సిరీస్‌లో ఇప్పటికే ఇరు జట్ల మధ్య తీవ్ర వాగ్వాదాలు, నిప్పులు చెరిగే మాటలు చోటుచేసుకున్న నేపథ్యంలో, తమ జట్టు మైదానంలో ఎదురయ్యే ఎలాంటి స్లెడ్జింగ్ కైనా భయపడబోదని స్పష్టం చేశాడు. మాటకు మాటతో సమాధానం ఇస్తామని తెలిపాడు.