నిర్మల్-జగిత్యాల జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్
NEWS Jul 22,2025 07:24 pm
మహారాష్ట్రలోని కళ్యాణ్ నుంచి ప్రారంభమైన 61వ జాతీయ రహదారి నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. నిర్మల్ నుంచి ఖానాపూర్ మండలం బాదనకుర్తి వరకు 35 కి.మీ. పనులు తుదిదశకు చేరాయి. రెండో విడతగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓగులాపూర్ నుంచి జగిత్యాల రూరల్ మండలంలోని చలిగల్ వరకు 39 కి.మీ. రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రహదారితో జిల్లా వాసులకు ప్రయాణం సులభం కావడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా వేగవంతమవుతుంది.