స్థానిక ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదా..?
NEWS Jul 22,2025 07:20 pm
జగిత్యాల: జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక ఎన్నికలు ఈసారి రసవత్తరంగా జరగనున్నాయి. శాసనసభ ఎన్నికల జరిగిన రెండేళ్ల తర్వాత క్షేత్రస్థాయిలో పల్లెపోరు జరుగనుంది. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంటుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటాపోటీ ఉండనుంది.జగిత్యాల జిల్లా 20 ZPTC, 20 MPP, 216 MPTC స్థానాలు ఉన్నాయి.