తుల్జాభవాని ఆలయాన్ని దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే
NEWS Jul 22,2025 07:16 pm
మహారాష్ట్రలో ప్రసిద్ధిగాంచిన తుల్జాపూర్ తుల్జాభవాని ఆలయాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం దర్శించుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు.