సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం
NEWS Jul 22,2025 07:25 pm
సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి ఆదివాసి సంఘం ఉట్నూర్ మండలం నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. జీవో నెంబర్ 49ని రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం ఉట్నూర్ పట్టణంలోని స్థానిక ఐబి వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఫ్లెక్సీకి వారు పాలాభిషేకం నిర్వహించారు. ఆదివాసులకు నష్టం చేసే జీవోను రద్దు చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.