తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
NEWS Jul 22,2025 12:38 pm
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. జూన్ 18 నుంచి 30 వరకు నిర్వహించిన పరీక్షకు 1,37,429 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 33.98 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం మీద 30,649 మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు విద్యాశాఖ వెల్లడించింది. టెట్ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం ఆన్ లైన్ లో నేరుగా విడుదల చేశారు.