తెలంగాణ ఆర్టీసీ మరో మైలురాయిని దాటింది. ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేశారని వెల్లడించారు ఎండీ సజ్జనార్. మహిళలు ఉచిత ప్రయాణ విలువ రూ.6700 కోట్లు అని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఆర్టీసీకి నిధులు విడుదల చేస్తోంది సర్కార్. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోల్లో 341 బస్ స్టేషన్ లలో సంబరాలు జరగనున్నాయని తెలిపారు ఎండీ. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్.