ఈడీ తీరుపై సీజేఐ సీరియస్
NEWS Jul 22,2025 11:18 am
ఈడీ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీజేఐ జస్టిస్ గవాయ్. రాజకీయ ప్రయోజనాల కోసం ఈడీని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ పరంగా వ్యవస్థీకృతమైన సంస్థగా ఉండాల్సిన ఈడీ కేవలం కొందరి ప్రయోజనాల కోసం పని చేసేలా వ్యవహరించడం దారుణమన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని, తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.