ధన్‌ఖడ్ రాజీనామాపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
NEWS Jul 22,2025 10:37 am
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్య రీతిలో తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆరోగ్య కారణాలను చూపుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇక, ధన్‌ఖడ్ రాజీనామాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ నిష్పాక్షికత, నిబద్ధతతో బాధ్యతలు నిర్వహించారని జనసేనాని కొనియాడారు.