కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ మృతి పట్ల సంతాపం తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కార్మిక ఉద్యమాల నుండి ప్రముఖ ప్రజా నాయకుడిగా అచ్యుతానందన్ ఎదిగారని ప్రశంసించారు. ముఖ్యమంత్రిగా తన పదవీకాలంలో కేరళ పురోగతికి ఎనలేని సేవ చేశారని గుర్తు చేశారు. ఎక్స్ వేదికగా స్పందించారు. అచ్యుతానందన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.