త్వరలోనే నిమిష ప్రియ విడుదల
NEWS Jul 22,2025 09:59 am
కేరళ నర్సు నిమిష ప్రియ విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు ప్రజాశాంతి ప్రెసిడెంట్ డాక్టర్ కే.ఏ.పాల్. చట్టాలు, ప్రభుత్వాలు చేయలేని పని దేవుడు చేశాడన్నారు. అందరి ప్రార్థనలు ఫలించి త్వరలోనే నిమిష ప్రియ విడుదల కాబోతున్నారని చెప్పారు. నిమిష ప్రియ ప్రాణాన్ని కాపాడేందుకు సహకరిస్తున్న ప్రధాని మోదీ, మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పాల్.