భారత దేశ ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధంఖర్ అనారోగ్య కారణాల రీత్యా రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. త్వరలోనే ఉప రాష్ట్రపతి పదవి నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపింది. ఇందు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొంది. అధికారికంగా షెడ్యూల్ రిలీజ్ చేస్తామని వెల్లడించింది ఈసీ.