ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా
NEWS Jul 21,2025 10:08 pm
పార్లమెంటు వర్షాకాల సమావేశాల వేళ అనూహ్య పరిణామం. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. వైద్యపరమైన కారణాలను చూపుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఆయన తన రాజీనామా లేఖను పంపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.